ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 8:05 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అదరగొట్టిన గిరిజన క్రీడా పాఠశాల ఆసిఫాబాద్ విద్యార్థినీలు.

అదరగొట్టిన గిరిజన క్రీడా పాఠశాల ఆసిఫాబాద్ విద్యార్థినీలు.

ఆసిఫాబాద్ అక్టోబర్ 11, అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12.

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో కొమురం భీం జిల్లా 4 గోల్డ్ , 2 సిల్వర్ , 6 బ్రంజ్ మొత్తం 12 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. ద్వితీయ స్థానంలో ములుగు జిల్లా నిలిచింది._

ఈ విజయం వెనుక అథ్లెటిక్స్ కోచ్ _విద్యాసాగర్ గారి నిరంతర కృషి దాగి ఉంది. ఒకవైపు క్రీడాకారులకు ఓవరాల్ ఛాంపియన్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, మరొకవైపు 12వ రాష్ట్రస్థాయి పోటీల కోసం ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, మరొకవైపు కొత్తగా వేస్తున్న గిరిజన క్రీడా పాఠశాల గ్రౌండ్ ప్రిపరేషన్, ట్రాక్ మార్కింగ్, జావెలిన్ & లాంగ్ జంప్ పిట్స్ తయారీ  మూడింటినీ ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహించి విజయాన్ని సాధించారు.

ఓవరాల్ ఛాంపియన్ సాధించిన విద్యార్థినీలను  జిల్లా కలెక్టర్ కె. హరిత, ఐటీడీఏ పీఓ మంద మకరంద్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, ఏసీఎంఓ ఉద్ధవ్, డీఎస్ఓ షేకు, జీసీడీఓ శకుంతల, ప్రధాన ఉపాధ్యాయుడు లింబారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు మీనా రెడ్డి, ఎస్సీఆర్టీ రవీందర్, హెచ్‌డబ్ల్యూఓ విజయలక్ష్మి, హ్యాండ్ బాల్ కోచ్ అరవింద్, ఖో-ఖో కోచ్ తిరుమల్, పాఠశాల అధ్యాపక బృందం  అభినందించారు. ఇలాంటి ఛాంపియన్ షిప్ లు మరెన్నో తీసుకోవాలని, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోట్నాక విజయ్, ప్రధాన కార్యదర్శి గుండం లక్ష్మణ్ తెలిపారు. అసోసియేషన్ సపోర్టు క్రీడా పాఠశాలకు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.